34. Karam Podi - Kandi Podi(కందిపొడి -కారం పొడి)

Nov 17, 2011
Kaaram Podi (కారం పొడి) కరివేపాకు పొడి 
ఒక కప్పు ధనియాలు
అర కప్పు సెనగ పప్పు
పావు కప్పు మినప పప్పు
పావు స్పూను జీలకర్ర
పది నుండి పన్నెండు ఎండుమిరప కాయలు
ఒక కప్పు కర్వేపాకు ఆకులు
కొంచం చింతపండు, ఉప్పు తగినంత
 రెండు టీ స్పూనుల నూనె
తయారు చేసే విధానం
మూకుడులో నూనె వేడి చేసి, అందులో సెనగ పప్పు, మినపప్పు వెయ్యాలి. అవి సగం వేగాక ధనియాలు, జీలకర్ర , ఎండుమిర్చి వేసి వేయించాలి. తర్వాత కరివేపాకు ఆకులు కూడా వేసి రెండు నిముషాలు వేయించి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.  దీనికి చింతపండు, ఉప్పు కలిపి మిక్సి పట్టాలి.  ఇది ఇడ్లి లోకి అన్నం లోకి కూడా బాగుంటుంది.
వెల్లుల్లి ఇష్టమైతే ఒక వేల్లుపయిని రేకలుగా వలిచి, వేయించి అది కూడా కలిపి గ్రైండ్ చేస్తే బాగుంటుంది.
కందిపొడి  (Kandi Podi)
ఒక కప్పు కందిపప్పు
పావు కప్పు సెనగ పప్పు, పావు కప్పు పెసరపప్పు
పది ఎండు మిరప కాయలు
పావు స్పూను జీలకర్ర
పావు స్పూను ఇంగువ కాని పది నుండి పదేహేను వరకు వెల్లుల్లి రేకలు (ఎవరికీ నచ్చినడి వాళ్ళు వేసుకోవచు)
ఉప్పు తగినంత
తయారు చేసే విధానం
పప్పులు అన్ని విడి విడిగా కమ్మని వాసన వచ్చేవరకు ఎర్రగా వేయించుకోవాలి.  ఎండు మిరప కాయలు కూడా విడిగా వేయించుకోవాలి. పప్పులు చల్లారాక మిరపకాయలు, ఉప్పు, జీలకర్ర కలిపి మిక్సిలో పొడి చేసుకోవాలి.  దీనికి ఇంగువ కావాలనుకునేవారు ఇంగువ కలుపుకోవాలి.  వెల్లుల్లి ఇష్టమైతే వెల్లుల్లి రేకల్ని విడిగా కచాపిచగా దంపుకొని కలిపితే బాగుంటుంది.(ఇంగువ, వెల్లుల్లి రెండూ కలపకూడదు.  ఏదో ఒక ఫ్లేవోర్ అయితేనే బాగుంటుంది.)

No comments:

Post a Comment

Thanks for reading the post....plz drop ur valuable comments.. it really motivates me...
Like this blog on facebook https://www.facebook.com/telugupostblog