కంది పొడి

Nov 15, 2011
కావలసిన పదార్థాలు:
సెనగపప్పు -ఒక కప్పు
కందిపప్పు -రెండు కప్పులు
జీలకర్ర –ఒకచేమ్చ
ఎండుమిరపకాయలు-కారానికి సరిపడ
సాల్ట్ –తగినంత
తయారిపద్దతి:స్టవ్ మీద కడాయి పెట్టి వేడెక్కాక సెనగపప్పు వేయించాలి .బాగావేగాక కందిపప్పు కూడా వేయించాలి .తరువాత జీలకర్ర ,ఎండుమిర్చి కూడా వేయించాలి .దీనికి ఆయిల్ అవసరం లేదు .చల్లారాక తగినంత సాల్ట్ వేసి మెత్తగా పౌడర్ చేయాలి .దీనిలో వెల్లుల్లి రేకలు వేసి పౌడర్ చేయాలి .వెల్లులి ఇష్టంలేకపొతే ఇంగువ వేసి వేయించి దానిని పౌడర్ లో కలపొచ్చు. అంటే కందిపొడి రెడి .
సర్వింగ్ పద్దతి :ఇది వేడి వేడి అన్నంలోకి పొడి ఇంకా కొంచెం నూనె వేసి మిక్ష్ చేసుకొని తింటే బాగుంటుంది .ఉల్లిపాయ పులుసు ,ఉల్లికోడులు  పులుసు ,ఆనపకాయ ముక్కలపులుసు వీటికి పక్కన వేసుకొని తింటే బాగుంటుంది.

No comments:

Post a Comment

Thanks for reading the post....plz drop ur valuable comments.. it really motivates me...
Like this blog on facebook https://www.facebook.com/telugupostblog