ఆనపకాయ మజ్జిగ పులుసు

Nov 16, 2011
కావలసినవి :
ఆనపకాయ -ఆఫ్ కాయ (తోక్క తీసి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేయాలి )
బెండకాయ –ఒకటి (కట్ చేసి పెటు కోవాలి )
వంకాయ –ఒకటి (కట్ చేసి పెట్టు కోవాలి )
సెనగపప్పు -రెండు స్పూన్స్ (నీటిలో పదిహేను నిమిషాలు నానబెట్టాలి )
అల్లం -చిన్న ముక్క
ధనియాలు -ఒక చెంచా(నీటిలో పదిహేను నిమిషాలు నానబెట్టాలి )
పచ్చి మిర్చి –ఒకటి 
ఆవాలు -ఆఫ్ స్పూన్
మెంతులు -ఆఫ్ స్పూన్
జీలకర్ర -ఆఫ్ స్పూన్
ఆయిల్ -ఒనె స్పూన్
కొత్తిమీర –కొంచెం
సాల్ట్ –తగినంత
మజ్జిగ –మూడుకప్పులు
ఎండుమిర్చి –ఒకటి
ఇంగువ –చిటికెడు
పసుపు -చిటికెడు
తయారి పద్దతి :సెనగపప్పు ,ధనియాలు ,అల్లం ,పచ్చిమిర్చి ,కొత్తిమీర నీరు లేకుండా మెత్తగా పేస్ట్ చేయాలి .ఒక గిన్నెలో మజ్జిగ తీసుకొని అందులోపసుపు , ఈ పేస్ట్ వేసి బాగా కలపాలి .ఆనపకాయ ముక్కలు ,బెండ కాయ ముక్కలు ,వంకాయ ముక్కలువేసి కొంచెం ఉప్పు కూడా వేయాలి .ఇప్పుడు దీనిని ముక్కలు ఉడికే దాకా బాగా మరగానివ్వాలి .ఇపుడు వేరే బాండలి పెట్టి ఆయిల్ వేసి ఆవాలు ,జీలకర్ర ,మెంతులు ,ఎండు మిర్చి ,ఇంగువ వేసి పోపు వేయించి పులుసులో వేసి బాగా మరిగించాలి .అంతే మజ్జిగ పులుసు రెడి
సర్వింగ్ పద్దతి :ఇది వేడి వేడి అన్నం లోకి బాగుంటుంది .

No comments:

Post a Comment

Thanks for reading the post....plz drop ur valuable comments.. it really motivates me...
Like this blog on facebook https://www.facebook.com/telugupostblog