రాజ్మా రైస్

Mar 21, 2011

కావలసిన పదార్థాలు:
రాజ్‌మా-రెండు కప్పుల

ఉల్లిపాయలు- రెండు,

టమేటోలు- రెండు,

జీలకర్ర, అల్లం తురుము- రెండు టీ స్పూన్లు,

పచ్చిమిరప కాయలు- మూడు

నూనె- ఒక టేబుల్ స్పూను

ధనియాల పొడి -ఒక టేబుల్ స్పూన్,

పసుపు- అర టీ స్పూన్

  కొత్తిమీర-మూడు ౩టేబుల్ స్పూన్స్

నల్ల ఉప్పు-ఒకటిన్నర టీ స్పూన్

ఉప్పు-రుచికి తగినంత
తయారీ విధానం:
రాజ్‌మాను రాత్రి అంతా నీటిలో నానబెట్టి వడకట్టేయాలి. ఐదు టీ కప్పుల నీరు పోసి మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేవరకూ కుక్కర్‌లో ఉడికించాలి. టొమేటో, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర గ్రేవి తయారు చేసుకుని పక్కన పెట్టాలి.
నాన్‌స్టిక్ ప్యాన్‌లో నూనె వేడిచేసి జీలకర్ర వేసి చిటపటలాడాక, గ్రేవి పోసి నూనె విడివడేదాకా ఉడకనివ్వాలి. అల్లం తురుము వేసి కొద్దిసేపు ఉడికించాలి. రాజ్‌మా, పసుపు, ధనియాల పొడి, ఉప్పు కలపాలి. నల్లు ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. కొద్ది నిమిషాలు సిమ్‌లో ఉంచి కొత్తిమీరతో అలంకరించి వడ్డించాలి.

No comments:

Post a Comment

Thanks for reading the post....plz drop ur valuable comments.. it really motivates me...
Like this blog on facebook https://www.facebook.com/telugupostblog