వంకాయ కూర

Mar 25, 2011

కావలసినవి :

వంకాయలు –పావుకిలో (చిన్న ముక్కలుగా కట్ చేయాలి )

ఆయిల్ –తగినంత

మినపపప్పు -నాలుగు స్పూన్స్

శెనగపప్పు-నాలుగు స్పూన్స్

ధనియాలు -నాలుగు స్పూన్స్

వేరుసేనగపప్పు-నాలుగుస్పూన్స్

ఇంగువ-చిటికెడు

ఉప్పు –తగినంత

ఎండుమిర్చి –పది

ఉల్లిపాయలు –రెండు (చిన్నముక్కలుగా కట్ చేయాలి )

తయారీ పద్ధతి :స్టవ్ మీద కడాయి పెట్టి వేడయినాకకొద్దిగా ఆయిల్ వేసి వేడి చేయాలి .ఆయిల్ వేడయినాక మినపప్పు ,శెనగపప్పు ,ధనియాలు ,వేరుసేనగపప్పు ,ఇంగువ,ఎండుమిర్చి వేసి రంగు మారేవరకు వేపాలి.పోపు తీసి పక్కన పెట్టాలి .అదే కడాయిలో ఉల్లిపాయ ముక్కలు వేసి వేపాలి .బ్రౌన్ రోమ్గులోకి రావాలి .యిది వేరే బౌల్ లోకి తీయాలి .పోపుని మెత్తగా మిక్సి పట్టాలి ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి .యిది కూరకారం తయారు అయినట్లు .అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి వంకాయ ముక్కలు వేసి మూత పెట్టాలి .అయిదు నిమిషాల తరువాత ముక్క మెత్తబడ్డాక కూర కారం వేసి కలపాలి .

సర్వింగ్ పద్దతి :వేడి వేడి అన్నంలోకి ,చపాతి లోకి బాగుంటుంది .

No comments:

Post a Comment

Thanks for reading the post....plz drop ur valuable comments.. it really motivates me...
Like this blog on facebook https://www.facebook.com/telugupostblog