కాక్టెయిల్ ఇడ్లీ

Apr 26, 2011

కావలసినవి :

ఇడ్లీ పిండి -ఆరు కప్పులు

ఉడక పెట్టిన పెట్టిన బఠానిలు -ఒక కప్పు

కేరెట్ తురుము -ఒక కప్పు

సన్నగా తరిగిన కొత్తిమీర-ఒక కప్పు

ఆయిల్ -టూ స్పూన్స్

జీలకర్ర పొడి -టూ స్పూన్స్

పసుపు -అఫ్ స్పూన్

ఉప్పు –తగినంత

ఆవాలు -టూ స్పూన్స్

ఇంగువ-చిటికెడు

తయారిపద్దతి:ఒక మినపప్పు కొలతకి రెండింతలు ఇడ్లీ రవ్వ తీసుకోవాలి.ఇడ్లీ పిండి తయారు చేయాలి .దానికి ఉప్పు కలిపి నాలుగు గంటలు నాననివ్వాలి.ఇప్పుడు ఇడ్లీ పిండి ఆరు కప్పులు తీసుకొని దానికి జీలకర్ర పొడి ,పసుపు ,కొత్తిమీర కలిపి ఇడ్లీ ప్లేట్ కి ఆయిల్ రాసి గుంటలలో మూడింతలు పిండి వేసి దానిమీద క్యారెట్ తురుము ,బఠానిలు చల్లాలి .ఇడ్లీ లను 15మినిట్స్ ఉడికించాలి .ఉడికిన తరువాత ఇడ్లీ లను తీసి 1నుంచి 6ముక్కలుగా చాకుతో కోయాలి .కడాయిలో రెండు స్పూన్స్ ఆయిల్ వేసి నూనె కాగిన తరువాత ఆవాలు ,ఇంగువ వేసి చిటపట లాడిన తరువాత కట్ చేసిన ఇడ్లీ ముక్కలను కడాయిలో వేసి 2నిముషాలు వేయించి వేడి వేడి గ సర్వ్చేయాలి.

టిప్:ఇడ్లీలు మెత్తగా ఉమ్దలంటే రవ్వ తక్కువగా ,మినపపప్పు  ఎక్కువ వేస్తె మెత్తగా నోట్లో వేస్తె కరిగి పోయేలా ఉంటాయి .

No comments:

Post a Comment

Thanks for reading the post....plz drop ur valuable comments.. it really motivates me...
Like this blog on facebook https://www.facebook.com/telugupostblog