7. Cocktail Idly

Dec 17, 2009
ఇడ్లీ పిండి - ఆరు కప్పులు, 
ఉడక పెట్టిన బఠానీలు - ఒక కప్పు,
కేరెట్ తురుము-ఒక కప్పు ,
సనగాతరిగిన కొతిమీర  -ఒక కప్పు  ,
నూనె-రెండు గరిటెలు ,
జీలకర్ర పొడి -రెండు చెంచాలు ,
పసుపు -ఆఫ్ చెంచా ,
ఉప్పు -సరిపడా ,
ఆవాలు -రెండు చెంచాలు ,
ఇంగువ -చిటికెడు

తయారీ విధానం :
ఒక మినప పప్పు కొలతకి రెండింతలు  ఇడ్లీ రవ్వ తీసుకొండి .ఇడ్లీ పిండి తయారు  చేసు కోవాలి .దానికి ఉప్పు కలిపి నాలుగుగంటలు నాన నివ్వాలి .ఇపుడు ఇడ్లీ పిండి   ఆరు కప్పులు తీసుకుని  దానికి జీలకర్ర పొడి ,పసుపు ,కొత్తిమీర కలిపి ప్లేట్లకి నూనె రాసి గుంటలతో మూడింతలు  పిండి వేసి దాని మీద క్యారెట్ తురుము , బఠానీలుచల్లాలి .ఇడ్లీ లను 15 నిమిషాలు ఉడికించాలి. ఉడికిన తరవాత ఇడ్లీలను తీసి 4 నుంచి 6 ముక్కలుగా కోసుకోవాలి.
బాండీలో నూనె వేసి 2 గరిటెలు, నూనె కాగిన తరవాత ఆవాలు, ఇంగువ వేసి చిటపటలాడిన తరవాత కట్ చేసి ఉంచుకున్న ఇడ్లి ముక్కలు బాండీలో వేసి రెండు నిమిషాలు వేయించి వేడి వేడి గా సర్వ్ చెయ్యాలి.
చిన్న ఇడ్లి చేసుకునే ప్లేటు ఉంటె అందులోనే వేసి కట్ చేయకుండా పోపులో వేసుకోవచ్చు

No comments:

Post a Comment

Thanks for reading the post....plz drop ur valuable comments.. it really motivates me...
Like this blog on facebook https://www.facebook.com/telugupostblog