11. చపాతీలకు, పరోటాలకు సైడ్‌డిష్‌ "పన్నీర్ కుర్మా

Dec 18, 2009

కావలసిన పదార్థాలు:
పన్నీర్... ఒక కప్పు
తెల్లగడ్డలు... నాలుగు
అల్లం... రెండు చిన్న ముక్కలు
కారం... అర టీస్పూన్
గరం మసాలా... ఒక టీ.
నెయ్యి... రెండు టీ.
ఉల్లిపాయ... ఒకటి
పెరుగు... ఒక కప్పు
పచ్చిమిర్చి... రెండు
ధనియాల పొడి... అర టీ.
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
ముందుగా పెరుగుకు గరంమసాలా పొడిని కలుపుకుని మిక్సీలో రుబ్బుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె పోసి ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, టమోటా, కొబ్బరి తరుగు, అల్లం పేస్ట్, పచ్చిమిర్చిలను వేసి బాగా వేయించాలి. తరువాత దీనికి పెరుగు మిశ్రమాన్ని, ముక్కలుగా చేసుకున్న పన్నీర్‌ను చేర్చి ఐదు నిమిషాలసేపు ఉడికించాలి. ఇది బాగా ఉడికిన తరువాత కొత్తిమీర తరుగులను చేర్చి దించేయాలి. ఈ కుర్మాను చపాతీలకు, పరోటాలకు సైడ్‌డిష్‌గా సర్వ్ చేయొచ్చు.

No comments:

Post a Comment

Thanks for reading the post....plz drop ur valuable comments.. it really motivates me...
Like this blog on facebook https://www.facebook.com/telugupostblog