పాలకూర జీడిపప్పు కూర

Feb 11, 2012

కావసిన పదార్దాలు :

పాలకూర - రెండు కప్పులు (శుబ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి .)

ఉల్లిపాయలు – రెండు

టొమాటోలు-రెండు

జీడి పప్పు -పావు కప్పు

పచ్చిమిర్చి –అయిదు

ఉప్పు –సరిపడ

గసగసాలు-ఆఫ్ స్పూన్

పసుపు –చిటికెడు

ఆయిల్ -రెండు స్పూన్స్

మసాలాలు -రెండు ఏలకులు ,ఒక లవంగం ,చిన్న దాల్చిన చెక్క ముక్క

కొత్తిమీర-సన్నగా తరిగింది కొంచెం

మసాలా ముద్ద తయారీ పద్దతి :జీడిపప్పు ,పచ్చిమిర్చి ,మసాలాలు ,గసగసాలు ,టమాటాలు,ఒక ఉల్లిపాయ వేసి మెత్తగా రుబ్బాలి .

తయారీ పద్దతి : బాండీలో నూనె వేసి వేడెక్కాకఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించి పాలకూర వేసి కలిపి కొంచెం నీరు చల్లి మూత పెట్టాలి .కొంచెం మగ్గాక మసాలా ముద్ద వేసి కలిపి కొంచెం వేగాక సరిపడ ఉప్పు వేసి కలిపి దించి కొంచెం కొత్తిమీర చల్లి వేడిగా సర్వ్ చేయాలి .ఇది రోటిలోకి బాగుంటుంది .

No comments:

Post a Comment

Thanks for reading the post....plz drop ur valuable comments.. it really motivates me...
Like this blog on facebook https://www.facebook.com/telugupostblog