కావలసినవిః
సేమ్య-రెండు కప్పులు
సెనగపప్పు –రెండు చెంచాలు
మినపపప్పు -రెండు చెంచాలు
వేయించిన వేరుసెనగ పప్పు –అరకప్పు
ఉప్పు –సరిపడా
కొబ్బరికోరు –పావుకప్పు
పచ్చిమిర్చి ముక్కలు –మూడు
ఉల్లిపాయలు –ఒకటి (సన్నగా తరగాలి )
నిమ్మరసం –ఒకచేమ్చ
నూనె లేక నెయ్యి -ఆరు చెంచాలు
కొత్తిమీర –అరకట్ట
తయారి పద్ధతి :
సేమ్యని మూడు చెంచాల నూనెలో గోధుమరంగు వచేవరకు వేయించాలి .మిగిలిన నూనెలో మినపపప్పు ,సెనగపప్పు ,కొత్తిమీర ,పచ్చిమిర్చి ముక్కలు వేసి రెండు నిముషాలు వేగనివ్వాలి .తర్వాత ఉల్లిముక్కలు వేసి గోధుమరంగు వచ్చేల వేపి అ తర్వాత సేమ్య, వేరుసేనగాపప్పు ,ఉప్పు వేసి ఒక కప్పు నీరు పోసి నిమ్మరసం వేసి బాగా కలపాలి.చిక్కగా అయిన సేమ్య మిశ్రమాన్ని ఇడ్లీ ప్లేటులో వేసి ఆవిరిమీద ఏడు నుంచి ఎనిమిది నిమిషాల వరకు ఉడికించి వేడి వేడి గ సర్వ్ చేయాలి .
No comments:
Post a Comment
Thanks for reading the post....plz drop ur valuable comments.. it really motivates me...
Like this blog on facebook https://www.facebook.com/telugupostblog