కావలసిన పదార్థాలు :
చిన్న వంకాయలు- 1/2 కిలో
టమోటాలు 1/4 కిలో
ఉల్లిపాయలు 1/4 కిలో
పచ్చి పప్పు 1/4 కప్పు
ధనియాలు - 1/4 కప్పు
పుట్నాల పప్పు- 1/4 కప్పు
నువ్వులు - 1/4 కప్పు
శనగ గుండ్లు 1/2 కప్పు
నూనె - 1/4 కప్పు
ఎండు మిర్చి- తగినన్ని
ఉప్పు - రుచికి సరిపడ
పోపు గింజలు - 1 టీ స్పూన్
పసుపు - కొద్దిగా
కొత్తిమీర కట్ట - ఒకటి
తయారుచేయు విధానం :
ముందుగా కొత్తిమీర కట్టను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. స్టవ్ మీద బాణలి పెట్టి శనగ గుండ్లు, పచ్చిపప్పు, ధనియాలు, మిర్చి, నువ్వులను వేరువేరుగా వేయించుకోవాలి. దోరగా వేగాక వాటిని మిక్సీలో పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక మందపాటి గిన్నే తీసుకుని పొయ్యి మీద పెట్టి నూనె పొయ్యాలి. నూనె కాగాక పోపు పెట్టి ఉల్లిపాయ, టమోటా ముక్కలు వేసి కలిపి మూత పెట్టి సన్నని సెగ మీద పేస్టులాగా ఉడకనివ్వాలి. తర్వాత వంకాయల్ని అడ్డంగా, నిలువుగా (గుత్తి వంకాయల్లాగానే) కోసి స్టవ్ మీద ఉన్న కూరలో వెయ్యాలి. ఇప్పుడు ఆ గిన్నెలో రెండు గ్లాసుల నీరు పోసి వంకాయలు, కొంచెం పసుపు, ఉప్పు వేసి, వంకాయలు ఉడకినతర్వాత నీళ్ళు సగం అయ్యే దాకా ఉడికించాలి. పక్కన పెట్టిన పొడిని గిన్నెలో వేసి అడుగు అంటకుండా గరిటెతో కలియతిప్పి 2 నిముషాలు ఉంచి కొత్తిమీర చల్లి దించుకొవాలి. వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
No comments:
Post a Comment
Thanks for reading the post....plz drop ur valuable comments.. it really motivates me...
Like this blog on facebook https://www.facebook.com/telugupostblog